బెస్ట్ టెంపుల్ పండిత్ అవార్డు ప్రదానం

వికారాబాద్, ఆంధ్రప్రభ: సౌత్ ఇండియా బెస్ట్ టెంపుల్ పండిత్ అవార్డు 2026 కి గాను వికారాబాద్ జిల్లా అలంపల్లి అశోక్ పంతులుకు అవార్డు లభించింది. ఆదివారం ప్రముఖ సినీ నటి జయప్రద చేతులమీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ వివిధ ఆలయ పండితులు ఆర్టికల్ డెమో ఇవ్వగా ప్రముఖ ప్రొఫెసర్లు అశోక్ పంతులకు నామినేటెడ్ చేయడం విశేషం. ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అవార్డు గత సంవత్సరాలుగా తమిళనాడు కర్ణాటక కేరళకు దక్కే ఈ పురస్కారం తెలుగు రాష్ట్రాలకు రెండవసారిగా లభించింది. ఈ అవార్డు రావడం పట్ల అశోక్ పంతులు హర్షం వ్యక్తం చేశారు.