నిండు జీవితానికి రెండు చుక్కలు- జీవితాంతం రక్షణ..

రేగొండ, ఆంధ్రప్రభ : కొత్త పల్లి గోరి మండలం దామరంచపల్లి గ్రామంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలోభాగంగా అంగన్వాడీ, మరియు ఆశా వర్కర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గ్రామ ఉప సర్పంచ్ మొట్టే రమాదేవి-మొగిళి హాజరై ఈ సందర్భంగా చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ…ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు,అంగన్వాడీ,టీచర్స్,తదితరులు పాల్గొన్నారు.