పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం..

  • కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి

పరకాల, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, ఐదేళ్ల లోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పరకాల పురపాలక సంఘం తొమ్మిదో వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి పిలుపునిచ్చారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు లో బస్టాండ్ ఆవరణలో పల్స్ పోలియో కార్యక్రమంలో నిర్వహించారు. పరకాల పురపాలక సంఘం తొమ్మిదో వార్డు కౌన్సిలర్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి హాజరై చిన్నారులకు స్వయంగా పల్స్ పోలియో చుక్కలు వేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరకాల మున్సిపల్ పరిధిలోని 9వ వార్డులో ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, చిన్నారుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.