రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గుండాయిజానికి పాల్పడుతోంది
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు
వినుకొండ, ఆంధ్రప్రభ : అమరావతి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ గూండాలు దాడి చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. ప్రశ్నించే గొంతులను భయపెట్టేందుకు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన అన్నారు.
అమరావతిలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై సమాధానం చెప్పాల్సింది పోయి, హింసకు దిగడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పాల్సింది పోయి, ప్రశ్నించిన వారిపై దాడులు చేయడం సరైన రాజకీయ విధానమా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలను తెలుసుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉందని, దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
