నిండు జీవితానికి రెండు చుక్కలే శ్రీరామరక్ష..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా రెండు పోలియో చుక్కల మందు శ్రీరామరక్ష అని వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణానికి సహకరించాలని నారాయణపేట జిల్లా ఎన్‌సీడీ కోఆర్డినేటర్ విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం నారాయణపేట జిల్లాఊట్కూర్ మండలంలోని పగిడిమర్రి, ఊట్కూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయిస్తున్న తీరును పరిశీలించి, ఒక్క చిన్నారి కూడా మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి సూచించారు. పోలియో నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సంతోషి, ఎం పి హెచ్ ఓ మణిమల, ఏఎన్ఎంలు గోవిందమ్మ, కవిత, తదితరులు పాల్గొన్నారు.
