‘సర్’ను సద్వినియోగం చేసుకోవాలి
‘సర్’ను సద్వినియోగం చేసుకోవాలి
15వ డివిజన్‌లో జరుగుతున్న ‘సర్’ తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కార్యక్రమాన్ని ఓటర్లు సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో విలువైన ఓటును సరిచూసుకోవాలని, లోపాలుంటే సరిచేసుకోవాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. ఆదివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 15వ డివిజన్ వీఎంఆర్ రోడ్డులో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) జరుగుతున్న తీరును తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానంలో ప్రతి ఓటు అమూల్యమైనదన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువతీ యువకుడు తమ పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని చెప్పారు. పేరు లేకపోవడం, చిరునామా మారడంతో పాటుగా మరే విధమైన లోపాలతో నైనా విలువైన ఓటు హక్కును కోల్పోకూడదన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ఓటర్లు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఇంటికి వచ్చే బీఎల్‌వోలకు పూర్తి సహాయ సహాకారాలను అందించాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమలో సింగంశెట్టి రమేష్, గాదిరెడ్డి అమ్ములు, చిన్నా, ఈశ్వరరావు, నిమ్మల హేమ, సటు శ్రీను, రవీంధ్ర తదితరులు పాల్గొన్నారు.
