రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించాం

విష్ణువర్ధన్ రెడ్డి

శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రభ : మాజీ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు మహనీయుడని, మహనీయులకు ప్రాంతాలు, భాషలు ఉండవని ఏపీ బీజేపీ సీనియర్ నాయకుడు ఎస్. విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటన విడుదల చేశారు. తెలుగు బిడ్డ అయిన పి.వి. నరసింహారావుకు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలకు అతీతంగా నివాళులు అర్పించామని తెలిపారు. విద్వేష, విభజన రాజకీయాలను విడనాడి ప్రజల కోసం పనిచేయాలని కవితకు సూచించారు.

ప్రజల కోసం నిజాయితీగా సేవ చేస్తే భవిష్యత్తులో మీ విగ్రహాలు కూడా ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన పి.వి. నరసింహారావు విగ్రహాన్ని ప్రస్తావిస్తూ, “మేము మహనీయులను పార్శిల్ చేయం… భావి తరాలకు అందిస్తాం” అని విష్ణువర్ధన్ రెడ్డి తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు.