చిరుత సంచారంపై అప్రమత్తంగా ఉండాలి: అటవీశాఖ

కొత్తగూడ, ఆంధ్రప్రభ : కొత్తగూడ రేంజ్ పరిధిలోని సరిహద్దుల్లో చిరుత పులి సంచారించే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తం గా ఉండాలని కొత్తగూడ రేంజ్ అధికారి వంశీకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం లో చిరుత పులి సంచారాన్ని అటవీశాఖ అధికారులు గుర్తించడంతో చుట్టూ పక్కల గ్రామాలను ముందస్తుగా అప్రమత్తం చేశారు. అడవి ప్రాంతం లో పశువులను మేపడానికి తీసుకెళ్లాద్దని సూచించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా ఎవరు బయటకు రావద్దని కోరారు. ఎవరైనా చిరుత పులి సంచారం గమనించినట్లయితే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. వన్యప్రాణులకు హాని కలిగిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.