పద్మశ్రీ డా. పి. విజయానంద రెడ్డికి ఘన సన్మానం..
ఊట్కూర్, ఆంధ్రప్రభ : పాలమూరు రెడ్డి సేవా సమితి ఆధ్వర్యంలో పద్మశ్రీ పురస్కార అవార్డు గ్రహీత డాక్టర్ పి. విజయనందారెడ్డిని నారాయణపేట జిల్లాఊట్కూర్ మండల పరిధిలోని ఓబులాపూర్ సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి ఆదివారం పద్మశ్రీ 2026అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పద్మశ్రీ అవార్డు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటని, ఈ అవార్డును అందుకోవడం సమాజానికి చేసిన విశిష్ట సేవలకు లభించే గొప్ప గౌరవమని అన్నారు. వారి సేవలు యువతకు ఆదర్శంగా నిలుస్తాయని, మరెందరో సేవా కార్యక్రమాల్లో ముందుకు రావడానికి స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. అనంతరం పద్మశ్రీ గ్రహీతకు శుభాకాంక్షలు తెలియజేస్తూవారిసేవలను కొనియాడారు.
