త్యాగానికి స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్..

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : త్యాగానికి స్ఫూర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని హైకోర్టు లాయర్ డాక్టర్ నలమాస కృష్ణ అన్నారు.ఆదివారం మండలంలోని కొమ్మలమంచ గ్రామ గౌడ సంఘం అధ్యక్షుడు జంపన్న గౌడ్ ఆధ్వర్యంలో విగ్రహ దాత నలమాస కృష్ణ అందించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బహుజనల ఆకాంక్షకు కుల వృద్ధులందరిని కలుపుకొని వారి అభివృద్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తి సర్వాయి పాపన్న అని కొనియాడారు.సర్వాయి పాపన్న చరిత్రలో భవిష్యత్ తరాలకు తెలిపే విధంగా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.

అన్నదాన కార్యక్రమానికి,గద్దె నిర్మాణానికి సహకరించిన దాతలను దొనికెన బిక్షం,సుధాకర్ లను శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కొమ్ములవంచ గ్రామ సర్పంచ్ రవీందర్,ఉప సర్పంచ్ రామూర్తి,కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రమణ,ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు,ఉమ్మడి జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కమలాకర్,జిల్లా కార్యదర్శి వెంకన్న,గునిగంటి మోహన్,పటేల్ రామన్న,జెర్రీపోతుల వెంకన్న,దేవేందర్,అడ్వకేట్ రమేష్,కొమ్ములవంచ గౌడ సంఘం కార్యదర్శి సురేష్,దొనికేన బిక్షం,సుధాకర్,వీరన్న,వెంకన్న,యూత్ అధ్యక్షుడు మైధం సురేష్ తదితరులు ఉన్నారు.