ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు: డాక్టర్ క్రాంతికుమార్
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఆదివారం డాక్టర్ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలో మొత్తం 23 పోలియో బూతులను ఏర్పాటు చేసి, అప్పుడే పుట్టిన శిశువుల నుంచి ఐదేళ్లలోపు వయసు గల 1,842 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ క్రాంతి మాట్లాడుతూ.. పోలియో మహమ్మారి రహిత సమాజాన్ని నిర్మించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్హెచ్పీలు, సూపర్వైజర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఫార్మసీ ఆఫీసర్, ఆశా కార్యకర్తలు మరియు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.
