భూ సేకరణను అడ్డుకుంటాం…
బిఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ, ఆగస్టు 14 : డిండి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గం, మండల పరిధిలోని మంతటి గ్రామంలో పంట పొలాలను ధ్వంసం చేసి భూ సేకరణ చేసేందుకు ప్రయత్నిస్తే అడ్డుకొని తీరుతామని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి హెచ్చరించారు.
శుక్రవారం మంతటి గ్రామంలో పంట పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా అనేక మంది రైతులు డంపింగ్ యార్డ్ కోసం సుమారు 125 ఎకరాల భూమిని తీసుకుంటామని బెదిరిస్తున్నారని ఎట్టి పరిస్థితుల్లో తమ భూమిని ఇచ్చేది లేదని ఆయన దృష్టికి తీసుకురావడంతో ఆయన మాట్లాడుతూ.. డిండి ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు ఎస్ఎల్బీసీ తో పాటు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ ఇక్కడి నుండి నీటిని తరలించి రైతుల నోట్ లో మట్టి కొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారని నిలదీశారు.
రైతులు తమ వ్యవసాయ పొలంలో రెండు పంటలు వేస్తూ జీవనం సాగిస్తుంటే డంపింగ్ యార్డ్ కోసం భూమిని సేకరించడం దారుణమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు అర్థం రవి లక్ష్మయ్య సత్యం భీముడు గ్రామ నాయకులు మంతటి శ్రీను తదితరులు పాల్గొన్నారు
