ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపు..

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపు..

రాజకీయ కక్ష బీఆర్ఎస్ నాయకుడు చైతన్య కిరణ్

వికారాబాద్, ఆంధ్రప్రభ :ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రత తగ్గింపు.. పూర్తిగా కక్షసాధింపు రాజకీయమే: బీఆర్ఎస్ నాయకులు చైతన్య కిరణ్ మల్కాపురం తీవ్ర విమర్శ 25 సంవత్సరాల పాటు భారత పోలీసు సేవ (ఐపీఎస్) అధికారిగా దేశానికి విశిష్ట సేవలందించి, పదవీ విరమణ అనంతరం కూడా దాదాపు పదేళ్ల పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా వేలాది మంది పేద, అణగారిన విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు రాజకీయాలకు నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు చైతన్య కిరణ్ మల్కాపురం తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలు, అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకే ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పాల్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
ఇప్పటికే శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిపై పలుమార్లు హత్యాయత్నాలు జరిగిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని గుర్తుచేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా పలుమార్లు వెల్లడించినప్పటికీ, అలాంటి పరిస్థితుల్లో ఆయన భద్రతను తగ్గించడం అత్యంత నిర్లక్ష్యపూరితమైన చర్య అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన కక్షసాధింపు ధోరణిని వీడి, ఆయనకు పూర్తి స్థాయి భద్రతను కల్పించాలని చైతన్య కిరణ్ మల్కాపురం డిమాండ్ చేశారు.