చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేసిన ఎమ్మెల్యే

బంటుమిల్లి, ఆంధ్రప్రభ: పోలియో రహిత భారతదేశం లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా బంటుమిల్లి బస్టాండ్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన కేంద్రంలో పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమిష్టిగా సహకరించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.