విద్యుత్ షాక్తో ఆవు మృతి..
- పరిహారం ఇవ్వాలని రైతు విజ్ఞప్తి
కోదాడ, ఆంధ్రప్రభ : సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామంలో విద్యుత్ షాక్కు గురై ఆవు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.
గ్రామానికి చెందిన రైతు తోడేటి శ్రీనుకు చెందిన ఆవు మేతకు వెళ్లిన సమయంలో ట్రాన్స్ఫార్మర్ సమీపంలో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు తెలిపారు. సుమారు లక్ష రూపాయల విలువ చేసే ఆవు మృతి చెందడంతో రైతు తీవ్రంగా నష్టపోయాడు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులు స్పందించి తనకు తగిన పరిహారం అందించాలని రైతు శ్రీనివాస్ (శ్రీనుకు) విజ్ఞప్తి చేశారు.
