Mohanlal Germany Dance | స్టేజ్‌పై అదరగొట్టిన మోహన్‌లాల్
Mohanlal Germany Dance | స్టేజ్‌పై అదరగొట్టిన మోహన్‌లాల్
జర్మనీలో స్టార్ నైట్ షోలో డ్యాన్స్‌తో అభిమానులను అలరించిన మలయాళ సూపర్ స్టార్
‘మనోహరి’, ‘మేఘం కరిగేనా’ పాటలకు ఎనర్జిటిక్ స్టెప్పులు..
వైరల్‌గా మారిన వీడియోలు
Mohanlal Germany Dance | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ మరోసారి తన ఉత్సాహం, ఎనర్జీతో అభిమానులను ఫిదా చేశారు. జర్మనీలో నిర్వహించిన ‘స్టార్ నైట్ షో’లో పాల్గొన్న ఆయన, హిట్ పాటలకు ఉత్సాహంగా నృత్యం చేస్తూ ప్రేక్షకులను అలరించారు. 66 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా వేదికపై సందడి చేసిన మోహన్‌లాల్, ‘బాహుబలి-1’ చిత్రంలోని ‘మనోహరి’, ధనుష్ నటించిన ‘తిరు’ సినిమాలోని ‘మేఘం కరిగేనా’ పాటలకు డ్యాన్స్ స్టెప్పులు వేశారు. ఆయన ప్రదర్శనకు అభిమానుల నుంచి ఘనమైన చప్పట్లు, హర్షధ్వానాలు లభించాయి. మోహన్‌లాల్ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వయసులోనూ అదే ఉత్సాహం, చురుకుదనంతో ప్రేక్షకులను అలరించడం ఆయనకే సాధ్యమని అభిమానులు కామెంట్లు చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
