ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం..

దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలం లోని ద్వారక గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది, వ్యవసాయ పనులు చేస్తుండగా ట్రాక్టర్ రోటవేటర్ కింద పడి డ్రైవర్ మృతి చెందారు.దండేపల్లి ఎస్సై గూడేటి రాజవర్ధన్, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం,ద్వారక గ్రామానికి చెందిన తోట సంతోష్ (35) అనే వ్యక్తి వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి ట్రాక్టర్ తీసుకెళ్లారు.శుక్రవారం పొలం దున్నుతుండగా,రోటవేటర్ లో మట్టి తట్టుకోవడంతో ట్రాక్టర్ నుండి డ్రైవర్ కిందకి దిగి మట్టిని తీసివేస్తుండగా ప్రమాద వశాత్తు వెనుక ఉన్న రోటవేటర్ డ్రైవర్ పై పడడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతుని భార్య సంగీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంతోష్ మృతి చెందడం తో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.