TGPSC | 24 డీఈవో పోస్టులకు నోటిఫికేషన్ విడుదల…
TGPSC | వెబ్‌డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పాఠశాల విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ (DEO)/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 24 డీఈవో పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు జూలై 19 సాయంత్రం 5 గంటలలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు : 24 (మల్టీ జోన్-1లో 10, మల్టీ జోన్-2లో 14 పోస్టులు).దరఖాస్తు విధానం: TGPSC Official Website ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభం : జూన్ 12, 2026.దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 19, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు).
వయోపరిమితి : 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి (01-07-2026 నాటికి). దరఖాస్తు రుసుము రూ.1000 (ఓసీ, బీసీ), రూ.500 (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ)తో పాటు అదనంగా రూ.120 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎంపిక ఆబ్జెక్టివ్ రాత పరీక్ష ఆధారంగా జరుగుతుంది.
విద్యార్హతలు : కనీసం 55% మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/బీసీ/దివ్యాంగులకు 50%) పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు, బీఈడీ (B.Ed.) లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష (రాత పరీక్ష అక్టోబర్ 2026లో జరిగే అవకాశం ఉంది).
