జులై 7న గ్రామగ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా పండుగ

  • ​ఎమ్మార్పీఎస్ నేత లింగస్వామి మాదిగ

​భువనగిరి, ఆంధ్రప్రభ : రాబోయే జులై 7వ తేదీన ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా పండుగను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ పిలుపునిచ్చారు. ​ శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల సుదీర్ఘ పోరాటంతో సాధించుకున్న ఎస్సీ వర్గీకరణ ఫలితాలను మాదిగ, మాదిగ ఉపకులాలు అందిపుచ్చుకుని ఆర్థికంగా నిలదొక్కుకోవాలని కోరారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో మాదిగ జాతి అభివృద్ధి చెందాలని, భవిష్యత్తు పోరాటాల్లో నూతన యువతరం చురుగ్గా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన మాదిగ ప్రజలు విజ్ఞానం, నైపుణ్యాలను ఆయుధాలుగా చేసుకుని అన్ని రంగాల్లో ఎదగడానికి నడుం బిగించాలని ఆయన పిలుపునిచ్చారు.