ఎలుకల మందు సేవించి వృద్ధురాలు మృతి

రేగొండ, ఆంధ్రప్రభ: ఎలుకల మందు సేవించి వృద్ధురాలు మృతి చెందిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రాయపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన జాలిగాపు రాజమ్మ (77) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం ఎలుకల నివారణ మందు సేవించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పరకాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది.

మృతురాలి కుమారుడు జాలిగాపు రవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ హేమలత తెలిపారు.