Trust | విరాళాల వ్యవహారం.. కొత్త మలుపు

Trust | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అయోధ్యలోని బాలరామ మందిరానికి సంబంధించిన విరాళాల వ్యవహారం నేపథ్యంలో ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్‌రాయ్‌, ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేసినట్లు సమాచారం.

ఇటీవల చంపత్‌రాయ్‌ డ్రైవర్ టిన్ను యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పలు వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల మధ్య ట్రస్టులోని ఇద్దరు కీలక సభ్యులు రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే రాజీనామాలకు గల కారణాలపై ట్రస్టు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. విరాళాల వ్యవహారానికి ఈ రాజీనామాలకు ప్రత్యక్ష సంబంధం ఉందా, లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామంపై మరిన్ని వివరాలు అధికారిక ప్రకటన అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.