శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్న మండలి వైస్ చైర్మన్ పండే
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో జరుగుతున్న 11వ వార్షిక ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శుక్రవారం రాష్ట్ర శాసనమండలి వైస్ చైర్మన్ పండే ప్రకాష్ ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రకాష్ ముదిరాజ్ కు ఘన స్వాగతం లభించింది. పూజల అనంతరం ఆలయ పండితులు సత్కారం నిర్వహించి వేదాశీర్వచనం జరిపారు. మాజీ ప్రభుత్వ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కొలుపుల హరినాథ్, మాజీ జెడ్పిటిసి బొట్ల పరమేశ్వర్, కౌన్సిలర్ యాట శివకుమార్, మాజీ కౌన్సిలర్ బేతి రాములు, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ ఆడెపు బాలస్వామి, మాజీ ఆర్టీఏ మెంబర్ పంతం కృష్ణ, మాజీ ఎంపీటీసీ బింగి లతా రవి, నాయకులు ఆరె రాములు, హరీష్, మోతే వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
