పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డిచే ప్రజా గ్రీవెన్స్..
పుట్టపర్తి, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి అన్నారు. శుక్రవారం పుట్టపర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి నియోజకవర్గ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక, రెవెన్యూ, సంక్షేమ పథకాలు, తాగునీరు, రహదారులు, విద్యుత్, పింఛన్లు తదితర సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్య 03 ,రెవిన్యూ 4,పోలీస్02, రేషన్ కార్డు 01 మొత్తం సుమారు 10 అర్జీలు ప్రజల నుంచి స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలపై ఎలాంటి నిర్లక్ష్యం తగదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీకి తగిన పరిష్కారం చూపేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. సమస్యలను కాలయాపన చేయకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్న ఎమ్మెల్యే, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు సహకార సొసైటీ అధ్యక్షులు మండల టీడీపి కన్వీనర్ విజయకుమార్ , టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, మాజీ జెడ్పిటిసి శ్రీరాం నాయక్ , శ్రీరాములు, రాజా , కుమార్ రెడ్డి ,వివిధ శాఖల అధికారులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.
