వాడవాడలా మొహర్రం వేడుకలు
నేడు పీర్ల శోభాయాత్ర, నిమజ్జనం
చెన్నూర్ (ఆంధ్రప్రభ): మంచిర్యాల జిల్లా చెన్నూరులో మొహర్రం వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. గత పది రోజులుగా పట్టణంలోని లైనగడ్డ, ఖాజీపురా, గచ్చి మసీదు తదితర ప్రాంతాల్లో పీర్ల మండపాలను ఏర్పాటు చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.
ప్రతి రోజు ఉదయం పీర్లను వాడవాడలా ఊరేగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ వేడుకల్లో ముస్లింలతో పాటు హిందూ భక్తులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు.
పది రోజులుగా నిర్వహించిన మొహర్రం ఉత్సవాలకు నేడు ముగింపు పలుకనున్నారు. సాయంత్రం పీర్లను పట్టణ వీధుల్లో శోభాయాత్రగా తీసుకెళ్లి స్థానిక పెద్ద చెరువులో నిమజ్జనం చేయనున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
