BHIM | ఒకే యాప్‌లో రుణం నుంచి పెట్టుబడుల వరకు..
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: డిజిటల్ చెల్లింపుల కోసం వినియోగాస్తున్న భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్ అతి త్వరలో మరిన్నీ సేవలను అందుబాటులోకి తెస్తోంది. ఈ మేరకు ఎన్‌బీఎస్‌ఎల్ ఎండీ లలిత నటరాజ్ కీలక ప్రకటన చేశారు. వినియోగదారుల అందరికీ ఒకే వేదికపై సమగ్రంగా ఆర్థిక సేవలు అందించాలనే లక్ష్యంతో కొత్త సేవలను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపడుతున్నాట్లు ఆమె వెల్లడించారు. రుణాలు, పింఛన్ పథకాలు, బీమా సేవలు, పెట్టుబడి సాధనాలు వంటి సేవలను యాప్‌లో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వినియోగదారులు చెల్లింపులతో పాటు ఇతర ఆర్థిక అవసరాలను కూడా ఒకే యాప్ లో మనకు అందుబాటులోకి రానున్నాయి.
ఇక ఏడాది కాలంలో భీమ్ యాప్ వినియోగం పెరింగిదని. సంవత్సర కాలంలో యాప్ ద్వారా జరిగిన లావాదేవీలు దాదాపు మూడు రెట్లు పెరిగిందని ఆమె తెలిపారు. కేవలం ఒక్క మే నెలలోనే భీమ్ ప్లాట్‌ఫామ్ ద్వారా రూ.26,952 కోట్ల విలువైన లావాదేవీలు జరిగినట్లట వెల్లడించారు. తెలంగాణలో భీమ్ యాప్ ద్వారా జరిగిన లావాదేవీల్లో నిత్యావసర వస్తువుల కొనుగోళ్లు అగ్రస్థానంలో ఉన్నాయని ఆమె తెలిపారు. డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసం, యూపీఐ సేవల విస్తరణతో భీమ్ యాప్ వినియోగం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.
