మృతుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సహాయం..

మునుగోడు, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామానికి చెందిన గుంటోజు వేణుగోపాలాచారి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందడంతో ఆయన కుటుంబానికి విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ పెద్దను కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాన్ని ఆదుకునేందుకు విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు కూరెళ్ళ రఘునందన్ ఆచార్య నేతృత్వంలో సంస్థ ప్రతినిధులు విరాళాలు సేకరించారు. ఈ మేరకు సమీకరించిన రూ.50 వేల మొత్తాన్ని ఈరోజు నిర్వహించిన ద్వాదశ దినకర్మ సందర్భంగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ రాష్ట్ర నాయకులు గుంటోజు వెంకటాచారి,దాసోజు వెంకటాచారి,తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు మునిగంటి త్రినాథ్ చారి, ఇడుకోజు నరేష్ చారి, చొల్లేటి శ్రీనివాస్, పెంటాచారి,గుంటోజు మురళి తదితరులు పాల్గొన్నారు.