ఇండియన్ నేవీలో ఎంపికైన మాంగ్ సమాజ్ యువకుడు
జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఆశ పెల్లి గ్రామానికి చెందిన మోరే విజయ్ కుమారుడు మోరే సచిన్ ఇండియన్ నేవీ ఎస్సార్ లో ఉద్యోగానికి ఎంపికయ్యాడని మాంగ్ సమాజ అసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు మావాలే దత్త మాంగ్ తెలిపారు. జై నూర్ మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన దళిత యువకుడు ఎంతో కష్టపడి ఉద్యోగాన్ని సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సచిన్ మొరే కు జులై 15 నుండి ఒడిశా లో నేవీపై 9 నెలల పాటు శిక్షణ ఇస్తారని ఆయన పేర్కొన్నారు. మాంగ్ సమాజ్ యువకునికి ఉద్యోగం రావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. నేటి సమాజంలో యువత సచిన్ ఆదర్శంగా తీసుకొని ఉద్యోగరంగం వైపు దృష్టిసారించాలని ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలని జిల్లా అధ్యక్షులు మవాలె దత్త మాంగ్ అన్నారు. సచిన్కు ఉద్యోగం రావడం పట్ల ఆశ పెల్లి మాంగ్ సమాజ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
