తండ్రి అడుగు జాడలో తనయ

  • తిరుమల అన్నప్రసాదం ట్రస్ట్ కి రూ.3 లక్షల విరాళం ఇచ్చిన బంగ్ల శ్రేష్ఠారెడ్డి

మక్తల్, ఆంధ్రప్రభ : బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి కుమార్తె నర్వ గ్రామానికి చెందిన కుమారి బంగ్ల శ్రేష్ఠా రెడ్డి హైదరాబాద్ లోని జెఎన్ టియు యూనివర్సిటీలో సివిల్ ఇంజినీరింగ్ లో ఎంటెక్ పూర్తి చేసి,క్యాంపస్ ఇంటర్వివ్ ద్వారా వచ్చిన ఓ ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, మొదటి మూడు నెలల వేతనాన్ని టిటిడి దేవస్థానంకి విరాళంగా ఇస్తానని మొక్కుకున్న బంగ్ల శ్రేష్ఠా రెడ్డి మంగళవారం రోజు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కి ఈఓ టిటిడి తిరుమల పేరుమీద 3,00,000 రూపాయలను విరాళంగా ఇచ్చి మొక్కులను తీర్చుకున్నారు.

ఈ సందర్భముగా బంగ్ల లక్ష్మికాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకొని, తిరుమల శ్రీ అలివేలు మంగ, పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అన్నదానం ట్రస్ట్ కి విరాళంగా తన తనయ శ్రేష్ఠా రెడ్డి తన మొక్కుని తీర్చుకోవడం గొప్ప వరంగా భావిస్తూన్నామని అన్నారు. అదేవిదంగా మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ కు భారత ప్రధాని నరేంద్రమోడీ ఆధ్వర్యంలో త్వరలో జరుగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కేలా ఆశీర్వదించాలని ఆ అఖిలాండకోటి బ్రమ్మాండ నాయకులని వేడుకొన్నట్లు తెలిపారు.