ప్రజా దర్బార్‌కు విశేష స్పందన…

ఎన్డీ ఏ కార్యాలయం లో నిర్వహణ
కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించిన కార్యాలయ కార్యదర్శి
ప్రత్తిపాటి శ్రీధర్

భవానీపురం, ఆంధ్రప్రభ : ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కు విశేష స్పందన లభించింది. వివిధ సమస్యలపై ఎమ్మెల్యే కార్యాలయానికి తరలివచ్చిన ప్రజల నుంచి కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి వినతులు స్వీకరించారు. ప్రతి ఒక్కరి సమస్యను ఓపికగా తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు. ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు అందజేశారు. సామాజిక పెన్షన్లు, ఇళ్ళ రిజిస్ట్రేషన్లు, నూతన ఇంటికొరకు దరఖాస్తులు, తాగునీటి ఇబ్బందులు ,వైద్యం సాయం తదితర అంశాలపై ప్రజలు వినతులను అందజేశారు. ఆయా సమస్యలను సంబంధిత అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు.

సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ ప్రధాన లక్ష్యం…..

ప్రజా దర్బార్ ద్వారా నేరుగా ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించడమే కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యమని మాజీ కార్పొరేటర్ 47 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నాగోతి రామారావు అన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో నిరంతరం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లను పశ్చిమ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎస్సీ సెక్రటరీ పగిడిపల్లి ప్రభు చరణ్ , చిట్టినగర్ మండల అధ్యక్షులు దేవిన హరిప్రసాద్, 47 వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎం అప్పారావు, ఎన్డీయే కూటమి నేతలు సయ్యద్ కరిముల్లా, కోటేశ్వరరావు, కట్టా సాంబశివరావు, విస్సంశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.