శాశ్వత పరిష్కారానికి కృషి చేయాలి

  • ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి
  • కొత్తూరు అండర్ పాస్ పై నేషనల్ హైవేస్ అధికారులతో చర్చ

కొత్తూరు, ఆంధ్రప్రభ : కొత్తూరు అండర్ పాస్ రోడ్డులో వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత పరిష్కారాన్ని చేపట్టాలని నేషనల్ హైవేస్ అథారిటీ అధికారులకు ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. మంగళవారం కొత్తూరు మండల కేంద్రంలోని వై జంక్షన్ వద్ద నిర్మించిన అండర్ పాస్ రోడ్డును ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషి డీసీపీ శిరీష రాఘవేంద్ర, ఏసీపీ లక్ష్మినారాయణతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. ఎట్టి పరిస్థితుల్లో అండర్ పాస్ రోడ్డులో నీరు నిలువకుండా చూడాలని, అందుకు నేషనల్ హైవేస్ అధికారులు తగిన చర్యలు తీసుకుని సమస్య యొక్క శాశ్వత పరిష్కారం దిశగా చర్యలను చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్ హెచ్ ఓ శంకరయ్య, కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య, ఎస్సై సత్యశీల రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.