పార్టీ బలోపేతమే లక్ష్యం.. ప్రజాసేవే మన ధ్యేయం..
మాజీ మంత్రి దేవినేని ఉమా
(విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ ) : తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవలందించడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పనిచేయాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్ ఇన్‌చార్జిల శిక్షణా తరగతుల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ చేరవేయడంలో యూనిట్ ఇన్‌చార్జిలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీకి–ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని పిలుపునిచ్చారు.

క్రమశిక్షణ, సమన్వయం, ప్రజలతో నిరంతర అనుసంధానం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయాలన్నారు. ప్రతి కార్యకర్తలో నాయకత్వ లక్షణాలను పెంపొందించి, ప్రతి యూనిట్‌ను పార్టీకి బలమైన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా శిక్షణా కార్యక్రమాలు ఉపయోగపడతాయని తెలిపారు. కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అని, ప్రజాసేవే తెలుగుదేశం పార్టీ ప్రధాన లక్ష్యమని దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు.
