బ్రహ్మం చౌదరిని పరామర్శించిన సీఎం చంద్రబాబు
అమరావతి, ఆంధ్రప్రభ : కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఇటీవల అస్వస్థతకు గురై చికిత్స పొందిన బ్రహ్మం చౌదరి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం శనివారం తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
బ్రహ్మం చౌదరి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఆయన పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య పర్యవేక్షణ కొనసాగించాలని వైద్యులకు సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
