గొల్లు కృష్ణ మృతికి సంతాపం తెలిపిన యార్లగడ్డ..
గన్నవరం, ఆంధ్రప్రభ : కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు గొల్లు కృష్ణ ఆకస్మిక మరణం పట్ల ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం ఓ ప్రకటనలో సంతాపం తెలియజేశారు. బాపులపాడు మండలం ఏ.సీతారాంపురం గ్రామానికి చెందిన గొల్లు కృష్ణ వ్యాపార రంగంలో రాణించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారని యార్లగడ్డ పేర్కొన్నారు.
వివాదాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో సైతం తాను నమ్మిన సిద్ధాంతాల మేరకు ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవ చేశారని కొనియాడారు. రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ గా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, సమర్థత పనిచేసారన్నారు. రాజకీయంగా తనకు సుపరిచితుడైన గొల్ల కృష్ణ మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేసిన ఆయన కృష్ణ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
