మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు.. ఎస్సై తిరుపతి వార్నింగ్!

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు భీమ్‌గల్ మండలంలో బాబాపూర్ వెళ్లే మార్గంలో ఎస్పై సీహెచ్ తిరుపతి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల తనిఖీలు ఎస్సై మాట్లాడుతూ.. మద్యం వాహనాలు నడిపితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. వాహనదారులు నూతన చట్టాల నిబంధనలను పాటిస్తూ.. వాహనాలు నడపాలని సూచించారు.

డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 12 వాహనాలకు రూ. 2500 జరిమానా విధించినట్టు ఎస్సై తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిబ్బంది మధు, ప్రసాద్, మంగీలాల్ ఉన్నారు.