కనకదుర్గమ్మను దర్శించుకున్న సి ఎస్…

కుటుంబ సమేతంగా అమ్మవారి సేవలో జి. సాయి ప్రసాద్
ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం..
అమ్మవారికి ప్రత్యేక పూజలు..
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ :
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయానికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ డిప్యూటీ ఈవో కిషోర్ కుమార్, ఏఈవో బి.వి. రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏ. శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకర బాబు తదితరులు సీఎస్ కుటుంబానికి అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.