ప్రజా సమస్యలను పరిష్కరించాలి..

ప్రజా సమస్యలను పరిష్కరించాలి..

  • న్యాయం చేస్తామనే భరోసా ఇవ్వాలి..
  • రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని, ఆంధ్రప్రభ : ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించి, బాధితులకు తక్షణ భరోసా కల్పించడమే పోలీస్ శాఖ లక్ష్యమనిరామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. సోమవారం రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా అడిగి తెలుసుకున్నారు. బాధితులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడైనా సీపీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని, ఆపదలో ఉన్న వారికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి ఫిర్యాదులు అందాయి. వీటిపై వెంటనే స్పందించిన పోలీస్ కమిషనర్, సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. చట్ట పరిధిలో ఉన్న ప్రతి ఫిర్యాదుపై ఎలాంటి జాప్యం లేకుండా, పూర్తి పారదర్శకతతో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదె శించారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పిల్లలకు సంబంధించిన ఫిర్యాదుల విషయంలో అత్యంత సున్నితంగా, మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కె. శ్రీనివాస్ పాల్గొన్నారు.