Granite Lorry Accident | ఆటోను ఢీకొట్టిన గ్రానైట్ లారీ.. ముగ్గురు మృతి
Granite Lorry Accident | ఆటోను ఢీకొట్టిన గ్రానైట్ లారీ.. ముగ్గురు మృతి
Granite Lorry Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కామేపల్లి సమీపంలో ఆటోను గ్రానైట్ లారీ ఢీకొట్టడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసుల వివరాల ప్రకారం.. శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన 10మంది నాదెండ్ల మండలం సంకురాత్రిపాడులో జరిగే దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆటోలో బయల్దేరారు. కామేపల్లి రైల్వే అండర్‌పాస్ సమీపానికి చేరుకున్న సమయంలో గ్రానైట్ లోడ్‌తో వస్తున్న లారీ మలుపు తిరుగుతూ ఆటోను బలంగా ఢీకొట్టింది.

ప్రమాద తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుకొండలు (60), రమణమ్మ (50) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన వారిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ సుబ్బాయమ్మ (70) కూడా మృతి చెందడంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది.
మరో ఏడుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
