Bhagyashri Borse| షాకింగ్ స్టిల్స్‌ వైరల్‌

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: యువ కథానాయిక భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ చురుకుగా ఉండే ఈ భామ, తన సినిమాలకు సంబంధించిన అప్‌డేట్లు, ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా ఆమె విడుదల చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే, అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న లెనిన్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ సోషల్ మీడియాలో పంచుకున్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది.

భాగ్యశ్రీ బోర్సేకు కెరీర్‌లో కీలక మలుపు తీసుకొచ్చిన చిత్రం మిస్ట‌ర్ బ‌చ్చ‌న్. ఈ చిత్రంలో నటనకు గాను ఆమె ‘ఉత్తమ నటి (తొలి చిత్రం)’ విభాగంలో సైమా అవార్డు అందుకుని ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత వరుసగా ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల్లో అవకాశాలు దక్కించుకుంటూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. ఇటీవల గౌత‌మ్ తిన్నూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డ‌మ్ చిత్రంలోనూ ఆమె నటించింది. అలాగే దుల్క‌ర్ స‌ల్మాన్‌తో కలిసి నటించిన తమిళ చిత్రం కాంత ద్వారా తమిళ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ చిత్రాల్లో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి.

ఇక 2026లో విడుదల కానున్న చిత్రాలపై కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తెలుగు చిత్రం ‘లెనిన్’తో పాటు, శివ‌కార్తికేయ హీరోగా నటిస్తున్న, క‌మ‌ల్ హాస‌న్ నిర్మిస్తున్న తమిళ యాక్షన్ డ్రామా సెయోన్‌లోనూ భాగ్యశ్రీ కీలక పాత్రలో కనిపించనుంది. వరుస ప్రాజెక్టులు, పెరుగుతున్న అభిమాన గణంతో ఈ యువ కథానాయిక దక్షిణాది సినీ పరిశ్రమలో తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.