Birthday celebrations | ఖ‌ర్గే స‌మ‌క్షంలో రాహుల్ కేక్ క‌టింగ్‌

Birthday celebrations | ఖ‌ర్గే స‌మ‌క్షంలో రాహుల్ కేక్ క‌టింగ్‌

Birthday celebrations | ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జ‌న్మ‌దిన వేడుక‌లు
ప్రియాంక గాంధీ, ఖర్గే సహా పలువురు నేతల శుభాకాంక్షలు
రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం రాహుల్ కృషిని కొనియాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు

Birthday celebrations | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) జన్మదిన వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వ‌ద్రా (Priyanka Gandhi Vadra)తో పాటు పలువురు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల మధ్య ఉత్సాహభరిత వాతావరణంలో రాహుల్ గాంధీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.

శుభాకాంక్షల వెల్లువ
రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏఐసీసీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ రాహుల్‌కు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు కేక్ తినిపించి ఆప్యాయంగా అభినందనలు తెలియజేశారు.

రాహుల్ నాయకత్వాన్ని కొనియాడిన ఖర్గే
ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే, ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఆశయాల పరిరక్షణ పట్ల రాహుల్ గాంధీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు. అణగారిన వర్గాలు, సామాన్య ప్రజల హక్కుల కోసం ఆయన నిరంతరం పోరాడుతున్నారని పేర్కొన్నారు. దేశ ప్రజలకు మరింత కాలం సేవలందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.