విద్యార్థులకు విద్యాసామగ్రి పంపిణీ

మునుగోడు, ఆంధ్రప్రభ: నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని లక్ష్మీదేవిగూడెం ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు గ్రామ సర్పంచ్ పాలకూరి రమాదేవి నరసింహగౌడ్ రూ.10 వేల విలువైన నోటుపుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ప్రతిభ కనబరిస్తే పాఠశాలకు మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రత్యేక బహుమతులు అందజేస్తామని తెలిపారు. అలాగే వారం రోజుల్లో పాఠశాలకు ప్రొజెక్టర్, కార్పెట్లను అందజేస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి మేకల విజయభాస్కర్, మండల విద్యాధికారి మల్లేశం, వార్డు సభ్యులు సద్దల కళ్యాణి శ్రీశైలం, నారగోని అనూష జగన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి పాలకూరి నరసింహగౌడ్, ఆంజనేయస్వామి ఆలయ కమిటీ చైర్మన్ బండారి శంకర్, గ్రామ పెద్దలు బండారి మల్లేష్, ప్రధానోపాధ్యాయురాలు గుంటుక ధనభార్గవి, ఉపాధ్యాయులు నరసింహ, మురళి తదితరులు పాల్గొన్నారు.