చలో వేల్పూర్ ఎక్స్ రోడ్ ధర్నా
చలో వేల్పూర్ ఎక్స్ రోడ్ ధర్నా
ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: బీఆర్‌ఎస్ నాయకులు
వేల్పూర్, జూన్ 17 (ఆంధ్రప్రభ): రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18న వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
బుధవారం వేల్పూర్ మండల కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల అధ్యక్షుడు జైడి నాగధర్ రెడ్డి మాట్లాడారు. బీఆర్‌ఎస్ శాసనసభ్యుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ఉదయం 10 గంటలకు వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద ఆయన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు.
యూరియా యాప్‌లోని సాంకేతిక లోపాలు, యూరియా సరఫరాలో జాప్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వర పరిష్కారం కోరేందుకే ధర్నా చేపడుతున్నట్లు వివరించారు.
రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ టౌన్ అధ్యక్షుడు బబ్బుల్ ప్రతాప్ రెడ్డి, రేగుల రాములు, ఉపసర్పంచ్ బాలయ్య, నాయకులు డొల్ల రాజేశ్వర్ రెడ్డి, ఏనుగు గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
