అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన దేవినేని అవినాష్

అగ్నిప్రమాద ఘటన స్థలాన్ని సందర్శించిన దేవినేని అవినాష్

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడలోని రైన్ బో చిల్డ్రన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడం ఊరటనిచ్చే విషయమని పేర్కొంటూ, ఆసుపత్రి సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా అన్ని ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.