Medchal బాలికపై అత్యాచారం కేసు.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
Medchal బాలికపై అత్యాచారం కేసు.. నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష
- ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు
మేడ్చల్ (Medchal), ఆంధ్రప్రభ: పదకొండేళ్ల క్రితం బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి కోర్టు కఠిన శిక్ష విధించింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ పోక్సో (POCSO) కేసును సుదీర్ఘంగా విచారించిన ప్రత్యేక న్యాయస్థానం సోమవారం సంచలన తీర్పును వెలువరించింది.
నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. అలాగే బాధితురాలికి రూ. 1 లక్ష ఆర్థిక పరిహారం చెల్లించాలని కోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది.
ఈ కేసులో పక్కా ఆధారాలతో చార్జ్‌షీట్ దాఖలు చేసి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన మేడ్చల్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఉన్నతాధికారులు అభినందించారు.
