Eturnagaram రైతుల భూములకు రక్షణ కల్పించాలి.. ఐటీడీఏకు వినతి
Eturnagaram రైతుల భూములకు రక్షణ కల్పించాలి.. ఐటీడీఏకు వినతి
ఏటూరునాగారం (Eturnagaram), ఆంధ్రప్రభ: మండలంలోని ఆకలవారి గణపురం గ్రామ పరిధిలో తమ భూములను అక్రమంగా కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ రైతులు సోమవారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారికి వినతిపత్రం సమర్పించారు.
1965 నుంచి సాగు చేసుకుంటున్న భూములకు రక్షణ కల్పించాలని వారు కోరారు. సర్వే నంబర్ 209లోని భూములపై కొందరు వ్యక్తులు గిరిజనులను రప్పించి గుడిసెలు, షెడ్లు ఏర్పాటు చేస్తూ అక్రమంగా ఆక్రమణలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు.
ఈ విషయంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ కబ్జాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని రైతులు ఐటీడీఏ అధికారులను కోరారు.
