ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలు
మధిరలో సేవా కార్యక్రమాలు..
రోగులకు పండ్లు, అనాథలకు నిత్యావసరాల పంపిణీ
మధిర, (ఆంధ్రప్రభ):
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను మధిరలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధిర మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రంగా హనుమంతరావు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు, అనంతరం అనాథ శరణాలయాలను సందర్శించి అక్కడి నివాసితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.
ఈ సందర్భంగా రంగా హనుమంతరావు మాట్లాడుతూ, ప్రజాసేవకు అంకితభావంతో పనిచేస్తున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలోని నిరుపేదలు, అనాథలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
భట్టి విక్రమార్క ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్తా, మండల, పట్టణ అధ్యక్షులు పారుపల్లి విజయ్, తలుపుల వెంకటేశ్వర్లు, నిడమానూరు వంశీ, అద్దంకి రవి, చావలి రామరాజు, రంగా శ్రీనివాసరావు, చెరుకూరి నాగార్జున, సంగయ్య తదితరులు పాల్గొన్నారు.
