చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషి అభినందనీయం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కృషి అభినందనీయం

  • కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు కరీం

వికారాబాద్, ఆంధ్రప్రభ : చేవెళ్ల పార్లమెంటు సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి అభినందనీయమని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు కరీం పేర్కొన్నారు. ప్రధానంగా వికారాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి శంకర్ పల్లి లింగంపల్లి తాండూర్ బషీరాబాద్ తదితర రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ లో భాగంగా 127 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడానిఆయన అభినందించారు. ఇదే కాకుండా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి పూణే వరకు త్వరలో ప్రారంభించనున్న బుల్లెట్స్ ట్రైన్ ద్వారా వికారాబాద్ ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని అన్నారు రాజకీయాలకతీతంగా అభివృద్ధి చేస్తున్న చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభినందిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *