యూరియా యాప్ ను వెంటనే ఎత్తి వేయాలి..

యూరియా యాప్ ను వెంటనే ఎత్తి వేయాలి..

బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి…

రుద్రూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం రైతులను నట్టేట ముంచడానికి యూరియా యాప్ తీసుకోవచ్చిందని దాన్ని వెంటనే ఎత్తివేయాలని బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి శుక్రవారం డిమాండ్ చేశారు. రుద్రూర్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు దినేష్ పాటిల్ కులచారి రుద్రూర్ మండల కిషన్ మోర్చ అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్ బిజెపి నాయకులతో కలిసి శుక్రవారం తహసిల్దార్ తారాబాయి కి వినతి పత్రం అందజేశారు. అనంతరం రుద్రూర్ మండల సమీకృత భవనం కార్యాలయం లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యూరియా యాప్ లో కాకుండా షాప్ లో అందించే విధంగా చర్యలు చేపట్టాలని, వరి పంట రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరత ఆన్లైన్ బుకింగ్ విధానంలో ఉన్న సాంకేతిక సమస్యలు, యూరియా అందుబాటులో లేక దొరుకుతాదో లేదో అన్న భయంతో రైతులు పడుతున్న ఇబ్బందులను తహసిల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. యూరియా పంపియని మరింత పారదర్శకంగా నిర్వహించి, స్థానిక సొసైటీలో, ఎరువుల దుకాణాల ద్వారా రైతులకు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

రైతుల ప్రభుత్వ అని చెప్పుకుంటూనే యూరియా యాప్ తీసుకొచ్చి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని దుయ్యబట్టారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తక్షణ పరిష్కారం చూపించాలని వినతి పత్రంలో విజ్ఞప్తి చేశారు. ఈ యాప్ వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని, చాలామంది రైతులకు యాప్ ను వాడే విధానం తెలియడం లేదని అన్నారు. రైతులకు సరిపడా యూరియా ఉంటే యాప్ తో పనేముందని ప్రశ్నించారు. రైతులందరికీ స్మార్ట్ ఫోన్లు లేక చిన్న ఫోన్లలోతో యాప్ డౌన్లోడ్ కాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. తక్షణమే యూరియా యాప్ ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులపై ఇంత కక్ష కట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఎక్కడలేని విధంగా ఈ యాప్ ను తీసుకువచ్చి, అది రైతులకు సరియైన అవగాహన కల్పించకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కలిసి ఈ యాప్ ను తెచ్చి రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు.

భారతీయ జనతా పార్టీ రైతుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తామని, రైతుల న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ తెచ్చి కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతైనా యూరియా సప్లై చేయడానికి సిద్ధంగా ఉందని నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇన్ఆర్ట్ పెట్టు అంతేగాని రెండు బస్తాలు యూరియా ఇవ్వాలని శాస్త్రవేత్తల పేర్లు చెప్పి రైతుల కు ఇబ్బందులకు గురి చెయ్యొద్దన్నారు. న్యానో వాడితే ఏమి లాభం ఉంటుందో ముఖ్యమంత్రి చెప్పాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేశారు. లేనియెడల రైతులతో కలుపుకొని భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల కిషన్ మోర్చా అధ్యక్షులు ఎర్రోళ్ల గంగాధర్, జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, మండల అధ్యక్షుడు అలపాటి హరికృష్ణ, కోశాధికారి కటికే రామరాజు,ఏముల నవీన్, ప్రధాన కార్యదర్శి గజేందర్, సాయినాథ్, ఉపాధ్యక్షులు,రేపల్లె సాయి ప్రసాద్, భోజిగొండ అనిల్, అంబం సర్పంచ్ కుర్లెపు గంగాధర్, మండల సీనియర్ నాయకులు వెంకటేశ్వర గుప్తా, పార్వతి మురళి, రాజా వరప్రసాద్, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.