ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డుల కోసం నిరంతర పోరాటం..
కామారెడ్డి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పనిచేసే వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డుల కోసం నిరంతర పోరాటం చేయడం జరుగుతుందని రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షులు విరహత్ అలీ చెప్పారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా వర్కింగ్ మహాసభలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు . జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరుగుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ జిల్లా అధ్యక్షులు రజినీకాంత్ మున్సిపల్ చైర్మన్ ఉమారాణి శ్రీనివాస్ జర్నలిస్టులు ఉన్నారు.
