రుషికొండ సాగరతీరంలో యోగాంధ్ర కార్యక్రమం
రుషికొండ సాగరతీరంలో యోగాంధ్ర కార్యక్రమం
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో యోగా వేడుకలు
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహణ
విశాఖపట్నం, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం రుషికొండ సాగరతీరంలో ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ, పర్యాటక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. రుషికొండ బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి వైస్ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జాయింట్ కలెక్టర్ విద్యాదరి తదితరులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్, సీపీ, జేసీతో పాటు అధికారులు యోగా ఆసనాలు చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. సముద్రతీర వాతావరణంలో యోగా సాధనతో పాల్గొన్నవారిలో ఉత్సాహం కనిపించింది.
