Progress | స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
Progress | స్వర్ణాంధ్ర దిశగా అడుగులు
Progress | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు తెలిపారు. ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం సవాళ్లు, సంక్షోభాలు, సమస్యలను మిగిల్చి వెళ్లిందని, అయినప్పటికీ వాటన్నింటినీ అధిగమిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. అధికారాన్ని బాధ్యతగా, పాలకులను ప్రజాసేవకులుగా భావిస్తూ పనిచేస్తున్నామని చెప్పారు.
ప్రతి పౌరుడు, ప్రతి కుటుంబం, ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా కృషి చేస్తున్నామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తూ ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.
రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ రెండేళ్ల ప్రయాణంలో అండగా నిలిచిన రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు, రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసేందుకు ప్రజల మద్దతు, సహకారం కోరారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు.
